News

తెలంగాణ ముద్దుబిడ్డ, రచయిత దాశరథి కన్నుమూత


ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1928లో వరంగల్‌ జిల్లా చిన్నగూడూరులో దాశరథి జన్మించారు.


నిజాం వ్యతిరేక పోరాటంలో దాశరథి పాల్గొన్నారు. చిల్లదేవుళ్లు, మోదుగూపులు, జానపదం నవలలు రచించి సాహితీ రంగంలో విశేష ప్రశంసలు అందుకున్నారు. 'జీవనయానం' పేరిట ఆత్మకథ రాసుకున్నారు. తెలుగు సాహితీ చరిత్రలో మొదటిసారి నాలుగువేదాలను తెలుగులోకి అనువదించిన ఘనత దశరథికే దక్కుతుంది. రామాయణం, మహాభారతాలను సరళమైన భాషలో రాశారు. తెలంగాణ మాండలికంలో రాసిన 'చిల్లరదేవుళ్లు' నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. సాహితీ రంగంలో విశేష కృషి చేసిన దాశరథి అభినవ వ్యాసుడిగా గుర్తింపు పొందారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించిన దాశరథి...కృష్ణామాచార్య రంగాచార్యకు స్వయానా అన్న. దశరథికి ముగ్గురు సంతానం.


 దాశరథి మృతికి తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ సంతాపం తెలిపారు. అలాగే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, భట్టి, పొన్నాల, రచయిత అంపశయ్య నవీన్‌, కోవెల సుప్రసన్న సంతాపం తెలిపారు